ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Election Results)పై ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారు. చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ విజయానికి అభివృద్ధి, సుపరిపాలనే కారణమన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
- Advertisement -
“ఢిల్లీ ప్రజలకు సెల్యూట్. అద్భుతమైన, చారిత్రాత్మక విజయం అందించిన నా ప్రియమైన సోదరీమణులు, సోదరులకు నమస్కరిస్తున్నాను. ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోబోం. ఢిల్లీ అభివృద్ధి మా గ్యారంటీ. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తాం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించేలా పనిచేస్తాం. అద్భుతమైన విజయం కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నాను” అని ట్వీట్ చేశారు.