ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో AAP ఓటమి పాలైంది. అయితే ఓటమికి గల కారణాలు నిపుణులు వెల్లడిస్తున్నారు. అవి ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఈ ఓటమి వెనుక ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన నిర్ణయాలతోపాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ సహా కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర, సంజయ్ తదితర నేతలు జైలుకెళ్లడం వంటివి. అలాగే కేజ్రీవాల్ జైలుకు పోయాక ఆప్ లో నాయకత్వ లోపం ఏర్పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేకపోవడం కూడా కారణం ఉందన్నారు. అభివృధ్ది చెత్త తొలగించకపోవటం, మౌళిక సదుపాయాలు కల్పించకుండా భారతీయ జనతా పార్టీపై పదేపదే విమర్శలు చేయటం వంటివి కారణాలుగా చెప్పవచ్చును. పదేళ్ల AAP పాలన చూశాక విసుగుచెందిన ప్రజలు జీజేపీకి అవకాశం కల్పించారని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఆప్ 2015 మ్యానిఫెస్టోలో ఈ నదిని 100% శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు, కానీ అది నెరవేరలేదు.
సామాన్యుల పార్టీగా వెలుగులోకి తెచ్చిన ఆప్ క్రమంగా ప్రజల్లో ఆదరణ దక్కించుకుంది. కానీ కేజ్రీవాల్ ప్రయాణం క్రమంగా మారిపోతు వచ్చిందని అంటున్నారు నిపుణులు. 40 కోట్ల రూపాయల విలాసవంతమైన షీష్ మహల్ నిర్మాణం సహా అనేక అంశాలు ఆయనపై ఓటర్లలో నిరాశను పెంచాయని చెబుతున్నారు. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజల కోసం పనిచేయాలని ఆశించారు. కానీ భారీ వృథా వ్యయం కాస్తా, విరుద్ధంగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత కూడా కీలక పాత్ర పోషించింది. గత 10 సంవత్సరాల ఆప్ పాలనలో ఓటర్లు అనేక ఆరోపణలను సాకులుగా చూశారు. దీంతో ఈసారి బీజేపీ వాగ్దానాలపై ఓటర్లు మక్కువ చూపించారు. చివరిగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొంత తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. NDA పక్షాలు అన్ని కలసి ఆప్ పార్టీని అధికారం నుంచి దూరం చేశారు.