Saturday, February 8, 2025
Homeనేషనల్Delhi Secretariat: ఆప్ ఓటమి.. ఢిల్లీ సచివాలయం సీజ్

Delhi Secretariat: ఆప్ ఓటమి.. ఢిల్లీ సచివాలయం సీజ్

ఢిలీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో తక్షణమే ఢిల్లీ సచివాలయాన్ని(Delhi Secretariat) సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సచివాలయం నుంచి కీలక ఫైళ్లు, రికార్డులు తరలించొద్దన్నారు. ఎల్‌జీ ఆదేశాల మేరకు సచివాలయాన్ని సీజ్‌ చేయాలని జీఏడీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

కాగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. తాజాగా అధికారంలోకి రావడంతో ఆప్ ప్రభుత్వం అవినీతి ఆరోపణపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సచివాలం సీజ్‌కు ఎల్‌జీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్ 22 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News