హైదరాబాద్‌లోని మెహిదీపట్నం జి. పుల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో సివిల్స్ ఆస్పిరెంట్స్ క్లబ్ ప్రారంభమైంది. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కోసం హైదరాబాద్ లోని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో మెహదీపట్నంలోని జీ పుల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో సివిల్స్ ఆస్పిరెంట్స్ క్లబ్ ప్రారంభించారు.
సివిల్స్ కష్టమేం కాదు
సివిల్స్ ఆస్పిరెంట్స్ క్లబ్‌ను జి పుల్లారెడ్డి డిగ్రీ-పిజి కాలేజ్ కార్యదర్శి పి. సుబ్బారెడ్డి అధికారికంగా ప్రారంభించి, ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ అకాడమీ అందించిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే దృఢమైన కోరిక విద్యార్థులకు ఉంటే సివిల్స్ లో విజయం సాధించడం కష్టమేమీ కాదన్నారు.
ఫ్రీ క్లాసులు
ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడమీ డైరెక్టర్ & చీఫ్ మెంటర్ డాక్టర్. భవానీ శంకర్ మాట్లాడుతూ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉచిత మాస్టర్ క్లాసులు చెబుతున్నట్టు తెలిపారు. వీటిలో 24-గంటల ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం కీలకమైన సబ్జెక్టులను నిపుణులైన ఫ్యాకల్టీ సభ్యులచే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మురళీకృష్ణ మాట్లాడుతూ 250 మంది విద్యార్థులు సివిల్స్ ఆస్పిరంట్స్ క్లబ్ లో నమోదు చేసుకున్నారని, వారిలో 103 మందిని వారికి ఉన్న ఆసక్తి ఆధారంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు మరియు వింగ్స్ మీడియా మరియు జీ ఫైవ్ మీడియా ప్రతినిధులు గిరి ప్రకాష్, గణేష్, మహేష్, ప్రసాద్ పాల్గొన్నారు.