2025-26 విద్యా సంవత్సరానికి లా కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి లాసెట్(TG Lawcet), పీజీ ఎల్సెట్(PG LCET) షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://lawcetadm.tsche.ac.in/ను సంప్రదించండి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది.
- Advertisement -
లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్ ఇదే:
- నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025.
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025.
- ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, 2025
- ఆలస్య రుసుముతో మే 25, 2025
- పరీక్ష తేదీ జూన్ 6, 2025
- కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు.
- అర్హత- మూడేళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి.
ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు డిగ్రీతోపాటు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Untitled-696x1024.jpg)