Saturday, February 8, 2025
Homeపాలిటిక్స్Delhi Result: 'మేము ఢిల్లీకి వస్తున్నాం' ఢిల్లీ ఎన్నికల ఫలితాల మధ్య బీజేపీ పోస్టర్ రిలీజ్

Delhi Result: ‘మేము ఢిల్లీకి వస్తున్నాం’ ఢిల్లీ ఎన్నికల ఫలితాల మధ్య బీజేపీ పోస్టర్ రిలీజ్

ఢిల్లీ ఎన్నికల ఫలితాల మధ్య భారతీయ జనత పార్టీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో బీజేపీ ఢిల్లీకి వస్తుంది అనే కొత్త పోస్టర్ ను షేర్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు.

- Advertisement -

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పని చేసింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభించింది. మరోవైపు ఆమ్‌ఆద్మీ,కాంగ్రెస్ పార్టీ లు విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభ పడిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


మరో వైపు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు.27 సంవత్సరాల తరువాత అధికారం చేపట్టబోతున్న ఆనందంలో మునిగితేలుతున్నారు.

https://twitter.com/BJP4Delhi?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1875067143253016767%7Ctwgr%5E03f7beec1d80d77f8f35c08f64f52455c624a099%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.cnbctv18.com%2Findia%2Fpolitics%2Fdelhi-bjp-launches-poster-for-assembly-elections-dilli-chali-modi-ke-sath-19534038.htm

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News