తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) విభిన్న కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇటీవల ఆయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రూట్ మార్చిన సూర్య సరికొత్త లుక్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. క్రియేటివ్ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘రెట్రో'(Retro Teaser) అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో సూర్య గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ పవర్ ఫుల్ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.