ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసగిస్తున్నారు. ఇవాళ ఢిల్లీ ప్రజల్లో కొత్త విశ్వాసం కనిపిస్తుందన్నారు. ఢిల్లీ ప్రజలు మోదీ గ్యారెంటీని విశ్వసించారని ప్రధాని మోది పేర్కోన్నారు. ముందుగా ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదికి ఘనంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఢిల్లీలో విజయం సామాన్య విజయం కాదని మోదీ అన్నారు. వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం మాకు ఇచ్చారన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. మా పార్టీపై నమ్మకం ఉంచిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు పెంచి తిరిగి ఇస్తామన్నారు.
పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించిందన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని అహంకారంతో పరిపాలించారన్నారు. ఇక నుంచి ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో పరిపాలన సాగిస్తామన్నారు. ఈ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు అభినందనలు అంటూ ప్రశంసించారు మోదీ. నిజమైన విజేతలు దిల్లీ ప్రజలేనని కొనియాడారు. అడ్డదారుల్లో వచ్చిన వారికి ప్రజలు షాక్ ఇచ్చారని కితాబు పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు మొత్తం సీట్లు మాకే ఇచ్చారని హర్షం వ్యక్తం చేసారు. డబుల్ ఇంజిన్ సర్కారుపై ఇక్కడి ప్రజలు నమ్మకం ఉంచారు. హరియాణా, మహారాష్ట్రలో కూడా గొప్ప విజయం సాధించామన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో విజయంపై ముందుగా భాజపా ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున్న కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా సరదాగా భాజపా ఎంపీలు మనోజ్ తివారీ,బాన్సరీ స్వరాజ్,పార్టీ ఢిల్లీ ఎంపీ వీరేంద్ర సచ్ దేవ్ నృత్యాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంట కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా తదితరుల ఉన్నారు. మోదీని గజమాలతో పార్టీ ఎంపీలు, తదితరులు ఘనంగా సత్కరించారు.
మరో వైపు ఢిల్లీ తీర్పును అంగీకరిస్తున్నాం అని రాహుల్ గాందీ అన్నారు. పోరును ఇంకా కొనసాగిస్తామన్నారు. ఢిల్లీ అభివృద్ధి, స్థానికుల హక్కుల కోసం తమ పోరాటం ఇంకా సాగుతుందని ట్వీట్ చేశారు. కాలుష్యం, అధిక ధరలు, అవినీతి అంశాలను లేవనెత్తుతూనే ఉంటామని వెల్లడించారు.
PM Modi: ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు: మోదీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES