అక్కడ ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. 10, 20, 50, 100 రూపాయల నోట్ల కట్టలు వర్షంలా కురిసాయి. గుజరాతీ జానపద గాయకులు కీర్తిదన్ గాఢ్వి గుజరాత్ లోని వల్సద్ లో భజన గీతాలు పాడుతుంటే ఆ పారవశ్యంలో సభికులు ఇలా కరెన్సీ నోట్ల వర్షం కురిపించటం హైలైట్.
వల్సద్ లోని అగ్నివీర్ గౌ సేవా దల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో ఇదంతా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకంగా లక్షలాది రూపాయలను భజన కీర్తనకారుడు గాడ్విపై చల్లడం విశేషం. ఇలా వచ్చిన మొత్తాన్ని గో సేవ కోసం వినియోగించనున్నారు. గుజరాత్ లోని నవ్సారీ గ్రామంలో 2022లో గాడ్వి ఇలాగే భజనలు పాడగా ఏకంగా 50 లక్షల రూపాయల నోట్ల కట్టలను వర్షం కురిపించారు ఆహుతులు.
నిజానికి గుజరాత్ లో ఫోక్ సింగర్స్ పర్ఫాం చేస్తే చాలు ఇలా డబ్బులను చల్లడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఇలా డబ్బులు వెదజల్లినప్పుడంతా ఈ మొత్తాన్ని సేకరించి వాటిని సేవా కార్యక్రమాలకు వినియోగించటం గుజరాతీలు రివాజుగా పెట్టుకున్నారు.