అక్కినేని యువ హీరో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ‘తండేల్’(Thandel) మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో చైతన్య కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చైతూ, సాయి పల్లవి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.21.24కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీని చూసిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేవారు.
‘‘చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. చందూ మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్‌పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్‌కు అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా’’ అని కొనియాడారు. ఆయన ప్రశంసలపై నాగచైతన్య సంతోషం వ్యక్తం చేశారు. ‘‘థాంక్యూ సో మచ్ సర్. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం’’ అని రిప్లై ఇచ్చారు.
కాగా ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.