ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Travels Bus) బస్సులో భారీగా నగదు మాయమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం ఉదయం బయలుదేరింది. మార్గమధ్యలో ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు బస్సును నార్కెట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆపారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నగదు ఉన్న బ్యాగును బస్సులోనే ఉండి టిఫిన్ చేసేందుకు కిందకు దిగారు. అనంతరం బస్సు ఎక్కి చూడగా నగదు బ్యాగ్ మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మాయమైన బ్యాగులో రూ.23లక్షలు ఉన్నట్లు బాధితుడు వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.