మరో నాలుగు రోజుల్లోనే వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. తమని ప్రేమించిన వారిని రోజుకో గిప్ట్స్ తమ ప్రేమను చాటుకుంటున్నారు ప్రేమికులు. అయితే ఎప్పుడులా కాకుండా కాస్తా వెరైటీగా ఇస్తే బాగుండు అనిపిస్తుందా అయితే ఇవి మీకు నచ్చిన ప్రియులకు ఈ టెక్ బహుమతులను ఇచ్చి మీ ప్రేమను మరింత చాటుకోండి. అవేంటో చూద్దాం పదండి.
ప్రేమికుల రోజు ఇచ్చే బహుమతులు సాధారణ రోజులలో ఇచ్చే వాటి కంటే చాలా వెరైటీగా ఉంటాయి. పువ్వులు, టెడ్డీ బేర్లు మరియు చాక్లెట్లు ఇవ్వడం చాలా కామన్. ఇది పాత పద్ధతి అయిన మీరు మాత్రం కొంచెం వెరైటీగా ఆలోచించి ఈ బహుమతులు ఇచ్చేయండి.
స్మార్ట్ వాచ్
ఉదయం లేచి మెుదలు పడుకున్న వరకు టైంతో పాటు మనం పరుగెడుతుంటాం. అందులో ప్రతిసారి సెల్ చేసుకోవాలంటే కష్టం. అదే ట్రెండింగ్‌లో ఉన్న స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేసి మీ ప్రియమైన వారికి ఇచ్చేస్తే మీరు ఎప్పటికి గుర్తుండిపోతారు. మీరు దానిని ధరించినప్పుడల్లా వారి మనస్సులో మీరు గుర్తుకువస్తునే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో ఈ స్మార్ట్ వాచ్ లు అందరికి అందుబాటు ధరలోనే ఉన్నాయి.
ఇయర్‌బడ్స్
మీతో మీ ప్రియమైన వారు మాట్లాడాలన్నా ప్రతిసారి ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవాల్సిందే. ఇలా ప్రతి సారి ఫోన్ చూసుకునే వీలుకాకపోవచ్చు. అంతేకాదు మీ బైకు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ చూసుకోలేరు. అలాంటప్పుడు ఇయర్ బడ్స్ ద్వారా ఫోన్ ఈజీగా ఆన్సర్ చేసి మాట్లాడుకోవచ్చు. కాస్తాంతా చేతికి పని కూడా తప్పినట్టు ఉంటుంది. అయితే కాస్తా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఇయర్ బడ్స్ ఇవ్వటం వల్ల మీ ప్రియమైన వారు మీతో ప్రశాతంగా ఎలాంటి శబ్దాలు లేకుండా మాట్లాడుకోవచ్చు. అవసరమైనప్పుడు ప్రశాంతంగా మనసుకు నచ్చిన పాటలు వినచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు పాటలు వినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కారణంగా, ఇతర వినికిడి సమస్యలను నివారించడానికి ప్రీమియర్ బ్రాండ్‌లను ఎంచుకోవడం మంచిదని అంటున్నారు.
పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు
అప్పటిలా ఇప్పుడు హోం థియెటర్స్ కనిపించటం లేదు. ప్రతి ఇంట్లో పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు కనిపిస్తున్నాయి. మీరు లవర్స్ కి ఈ బ్లూటూత్ స్పీకర్‌లను కొనుగోలు చేయండి. మంచిగా ఫీల్ అవుతారు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇష్టమైన పాటలను వింటారు. వారు ఎక్కడికి వెళ్లినా దానిని తమతో తీసుకెళ్లేందుకు ఇది కంపర్టబుల్గా ఉంటుంది. ఆ పరికరం వారి వద్ద ఉన్నంత కాలం మీరు గుర్తుకు వస్తునే ఉంటారు. సాంగ్స్ ఉంటూసంతోషంగా ఉంటారు.
ఫోటో ఫ్రేమ్
ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజుల్లో యువతను బాగా ఈ ఫోటో ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌లు బాగా నడుస్తున్నాయి. అందులో మీ లవర్ కి నచ్చిన ఫోటోలు పెట్టి గిప్టుగా ఈ ప్రేమికుల రోజు ఇచ్చేయండి. థ్రిల్ గా ఫీల్ అవుతారు.
ఇన్‌స్టంట్ ఫోటో కెమెరా
ఈ రోజుల్లో ఇన్‌స్టంట్ ఫోటో కెమెరా ఇటీవల చాలా ట్రెండీగా మారింది. ఫోటోలలో ఫన్నీ దృశ్యాలను తీసి అప్పుడే ఇచ్చేలా బాగుంటుంది. ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, ఇది మంచి బహుమతి అని చెప్పవచ్చు.ఇది ఒక జ్ఞాపికగా గుర్తుండిపోతుంది.
స్ట్రీమింగ్ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్
స్ట్రీమింగ్ యాప్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు ఇతర కంటెంట్‌ను చూడటం అలవాటుగా మారింది. అందుకే ఏదైనా మంచి సబ్‌స్క్రిప్షన్‌ను మీ లవర్ కి గిప్టుగా కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చే బహుమతి వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే వరకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
మినీ ప్రొజెక్టర్
ఇప్పుడు కొత్త సినిమాలు ఏమి వచ్చిన థియెటర్ కి వెళ్లి చూడటం కాస్తా తగ్గింది. చాలా మంది యాప్ సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకొని వాటిలో కొత్త సినిమాలు చూస్తున్నారు. మరి మీరు కూడా మీ లవర్ కి ఈ మిని ప్రొజెక్టర్ ఇస్తే పెద్ద స్క్రీన్‌పై సినిమాను చూసేలా సంతోషిస్తారు.
చూశారుగా హ్యపీగా మీరు కూడా మీ లవర్ మనస్సును ఈ ట్రెండీ గిప్టు ఇచ్చి గెలుచుకోండి. ఇవి ఎంచుకునేటప్పుడు కాస్తా క్వాలీటీ మెయింటెన్ చేసేలా చూడండి.