
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాగ్ మయూర్ ఒకరు.

“సినిమా బండి” సినిమా తోనే విలక్షణమైన హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు మయూర్. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ కెరియర్ లో ఆచితూచి ముందడుగు వేస్తున్నాడు.

“సినిమా బండి” సినిమాలో మరిడేష్ బాబు పాత్రలో.. మయూర్ ఒదిగిపోయాడు. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో పాటు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి.

సినిమా బండి సినిమాలో రాయలసీమ యాసను మాట్లాడటమే కాకుండా, కీడాకోలా సినిమాలో తెలంగాణ యాసను కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు.

అలానే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన “వీరాంజనేయులు విహారయాత్ర” సినిమా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

రాగ్ మయూర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.