Tuesday, February 11, 2025
Homeచిత్ర ప్రభThandel Collections: బాక్సాఫీస్ వద్ద ‘తండేల్’ తాండవం

Thandel Collections: బాక్సాఫీస్ వద్ద ‘తండేల్’ తాండవం

అక్కినేని యువ హీరో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ‘తండేల్’(Thandel) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సినిమాలో చైతూ, సాయి పల్లవి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.21.24కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం చైతన్య కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రెండో రోజు కూడా రూ.20కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. ఇక ఆదివారమైన మూడో రోజు కూడా రూ.21కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.62.37 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

రూ.100కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అటు ఓవర్సీస్‌లోనూ ‘తండేల్’ తాండవం చేస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News