ఏపీ హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) మరోసారి మానవత్వం చాటుకున్నారు. నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద ఓ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి. అదే సమయంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న హోంమంత్రి అనిత.. ఈ ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ ఆపారు.
- Advertisement -
వెంటనే కారు దిగి గాయపడిన యువతి వద్దకు వెళ్లి స్వయంగా సపర్యలు చేశారు. హుటాహుటిన వేరే వాహనంలో యువతిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. యువతికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఇది గమనించిన స్థానికులు మంత్రిపై ప్రశంసలు కురిపించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/100225anitha1a.webp)