సాధారణంగా పరగడుపునే వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలుంటాయని వైద్యులు తెలుపుతుంటారు. ఇలా చేయటం మోషన్ ఫ్రీగా క్లియర్ అవుతుంది. అంతే కాదు చర్మం అద్దంలా కూడా మెరిసిపోతుందని అంటుంటారు. ఉదయాన్నే వేడి వాటర్ తాగటం వల్ల పొట్టలో ఉన్న మలినాలన్నీ కూడా క్లియర్ అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నీటిలో ఉప్పు ఎంత మోతాదులో ఉంటే మలబద్ధకం మాయమవుతుందని అంటున్నారు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
వేడి నీళ్లలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, మీరు వైద్యుల సలహాను పాటిస్తే మాత్రమే ఇలా చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలను చూడచ్చు. చాలా మందికి మలబద్ధకం సమస్యలు ఉంటాయి. ఉదయాన్నే కడుపు శుభ్రం చేయకపోతే, రోజంతా సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా పొట్టలోని మురికిని బయటకు పంపేందుకు పలు రకాల టిప్స్ పాటిస్తుంటారు. అలాంటి చిట్కాలలో ఇది కూడా చాలా ఉత్తమమైంది.
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జలుబు మరియు దగ్గు నివారణకు ఉప్పునీరు చాలా ఉపశమనం కల్గిస్తుందని చెబుతున్నారు. వైద్యుల సలహా లేకుండా ఇలా తాగకూడదని అనుభవజ్ఞుడైన వైద్యుడు బిశ్వజిత్ తెలిపారు. అయితే వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
శరీరంలో సోడియం స్థాయి తక్కువగా ఉంటే, అది హైపోనట్రేమియాకు దారితీస్తుంది. ఈ సందర్భంలో, ఉప్పునీరు బాగా పనిచేస్తుంది. ఉప్పునీరు తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనంగా ఈ ఉప్పు నీరు మంచి కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం వల్ల కొవ్వు తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలపడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఉప్పు నీరు తాగడం మొటిమల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. ఉప్పు నీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. నిత్యం ఉప్పునీరు తాగడం అలవాటు చేసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు దంత సమస్యలు సులువుగా నయమవుతాయని వైద్యులు తెలుపుతున్నారు.