Tuesday, February 11, 2025
Homeచిత్ర ప్రభThandel Piracy: ఆర్టీసీ బస్సులో 'తండేల్' మూవీ.. నిర్మాత తీవ్ర ఆగ్రహం

Thandel Piracy: ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ మూవీ.. నిర్మాత తీవ్ర ఆగ్రహం

నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ‘తండేల్’(Thandel) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సినిమాలో చైతూ, సాయి పల్లవి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.62.37 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ఈ సినిమాను పైర‌సీ స‌మ‌స్య వేదిస్తోంది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఈ మూవీని ప్ర‌ద‌ర్శించారు. దీనిపై చిత్ర నిర్మాత బ‌న్నీ వాసు తీవ్రంగా స్పందించారు.

- Advertisement -

“తండేల్’ సినిమా పైరసీ వెర్షన్‌ను ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్ర‌ద‌ర్శించార‌ని ఓ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన వార్త ద్వారా తెలుసుకున్నాం., ఇది చ‌ట్ట విరుద్దం..అన్యాయం మాత్ర‌మే కాదు. ఈ చిత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ఎంతో మంది వ్య‌క్తులకు ఘోర అవ‌మానం. సినిమా అనేది ఎంతో మంది ఆర్టిస్టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల క‌ల. అలాంటి సినిమాను పైరసీ చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని APSRTC ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావును కోరుతున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి” అని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ సినిమా రూ.100కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అటు ఓవర్సీస్‌లోనూ ‘తండేల్’ తాండవం చేస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News