నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని మొహమాటం లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతారు. దీని వల్ల ఆయనను అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఎక్కువయ్యారు.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘‘గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలువక తప్పదు.. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు’’ అని రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు ఎవరి స్టైల్లో వారు రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఎవరినీ ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారనే చర్చ మొదలైంది.
మరోవైపు లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. “రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమా లకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి.” అని ట్వీట్ చేశారు.