Tuesday, February 11, 2025
Homeహెల్త్Weight Loss: ఇలా చేస్తే ఎక్సర్‌సైజ్‌ లేకుండా బరువు తగ్గొచ్చు.. సెలబ్రిటీల సీక్రెట్ ఇదే..!

Weight Loss: ఇలా చేస్తే ఎక్సర్‌సైజ్‌ లేకుండా బరువు తగ్గొచ్చు.. సెలబ్రిటీల సీక్రెట్ ఇదే..!

ప్రస్తుతం యువతను వేధిస్తున్న సమస్యల్లో ఒకటి.. అధిక బరువు. బరువు పెరగడం ఎవరికైనా ఇబ్బందే అయితే వెయిట్ లాస్‌కి రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ అవసరమని నిపుణులు చెబుతారు. అయితే వ్యాయామం చేయకుండా బరువు తగ్గితే ఎంత బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కేవలం డైట్‌తో వెయిట్ లాస్ కావొచ్చని కొందరు ప్రముఖులు నిరూపిస్తున్నారు. మాధవన్, విద్యా బాలన్, హిమాన్షి ఖురానా వంటి సెలబ్రిటీలు ఎలాంటి ఎక్సర్‌సైజ్‌ చేయకుండా డైట్‌తోనే బరువు తగ్గారు. ఇదెలా సాధ్యమో నిపుణులు వివరించారు.

- Advertisement -

ప్రతి వ్యక్తి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఎక్సర్‌సైజ్‌ చేయడం, డైట్ పాటించడం అనేది కామన్ సొల్యూషన్. కానీ వ్యక్తి వ్యక్తికీ డైట్ ఫార్ములా డిఫరెంట్‌గా ఉంటుంది. బరువు తగ్గడానికి మాధవన్ ఇంటర్మిటెంట్ డైట్‌ ఫాలో అయ్యారు. విద్యాబాలన్ మాత్రం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ పాటించి బరువు తగ్గారు. వెయిట్ లాస్ అనేది పూర్తిగా ఎక్సర్‌సైజ్‌ పైనే ఆధారపడదు. శరీరంలో క్యాలరీల లోపం ఏర్పడితే బరువు తగ్గుతారు. అంటే తీసుకునే క్యాలరీల కన్నా ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తే బాడీలో క్యాలరీల లోపం ఏర్పడుతుంది. డైట్ ఒక్కటే ఫాలో అయి దీనిని అచీవ్ చేయొచ్చు.

అయితే డైట్ ఒక్కటే ఫాలో అవుతూ ఎక్సర్‌సైజ్‌ లేకపోతే కండరాలు శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, స్థిరంగా వెయిట్ లాస్ అయ్యేందుకు, హెల్తీ మెటబాలిజం ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌ కూడా చేయాలి. ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల బాడీ విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా మెటబాలిక్ రేటు పెరిగి మరిన్ని క్యాలరీలు కరుగుతాయి. దీర్ఘకాలంలో వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఇదెంతో పనికొస్తుంది.

హెల్తీ డైట్‌తో పాటు ఎక్సర్‌సైజ్‌ చేస్తే వెయిట్ లాస్ ప్రాసెస్ త్వరత్వరగా పూర్తవుతుంది. ఎక్సర్‌సైజ్‌ కండరాలు, ఎముకలను బలోపేతం చేసి స్టామినాను పెంచుతుంది. అంతేగాకుండా, ఫిజికల్ యాక్టివిటీతో ఒత్తిడి తగ్గి మూడ్ మెరుగవుతుంది. కార్డియోవస్కులర్ హెల్త్ బాగుంటుంది. యోగా, బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్ వంటివి వెయిట్ లాస్‌కు తోడ్పడుతూనే మానసిక ఆరోగ్యాన్ని బూస్ట్ చేస్తాయి.

బరువు తగ్గడానికి ఫుడ్ క్వాంటిటీని పూర్తిగా తగ్గించడం కన్నా ఫుడ్స్‌ని తెలివిగా ఎంపిక చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ తినడంతో పాటు తక్కువ పోషకాలు, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలు దూరం పెట్టాలి. అదే సమయంలో ప్రొటీన్ లభించే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ నీరు తాగుతూ ఉండాలి. ఇది మెటబాలిజంను మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది. కేవలం డైట్‌ని ఫాలో అయితే బాడీ ఫిట్‌నెస్ తగ్గిపోవచ్చు. కాబట్టి అటు డైట్, ఇటు ఎక్సర్‌సైజ్‌‌ని బ్యాలెన్స్ చేస్తే వెయిట్ లాస్ ప్రాసెస్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. (గమనిక: ఈ కథనం నిపుణుల అభిప్రాయం ప్రకారం రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News