Tuesday, February 11, 2025
Homeచిత్ర ప్రభBrahmaAnandam Trailer: ప్రభాస్ చేతుల మీదుగా ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్‌ విడుదల

BrahmaAnandam Trailer: ప్రభాస్ చేతుల మీదుగా ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్‌ విడుదల

కామెడీ కింగ్ బ్రహ్మానందం(Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌత‌మ్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం'(Brahma Anandam). ఈ మూవీలో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేయనున్నారు. ఆర్‌.వి.ఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్ర‌లను పోషించారు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) విడుదల చేసి మూవీ యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్తి కోసం తాత పెట్టిన కండిషన్లు మనవడు ఎలా క్లియర్‌ చేశాడనే కథలో సినిమాను తీసినట్లు ట్రైలర్‌లో చెప్పారు. ఫుల్ కామెడీతో పాటు ఎమోషన్‌ సీన్స్ కూడా చక్కగా చూపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News