Tuesday, February 11, 2025
Homeచిత్ర ప్రభAllu Aravind: ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి.. మెగా ఫ్యాన్స్ కు అల్లు అరవింద్ రిక్వెస్ట్

Allu Aravind: ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి.. మెగా ఫ్యాన్స్ కు అల్లు అరవింద్ రిక్వెస్ట్

సంక్రాంతి రేసులో నిర్మాత దిల్ రాజు.. ఒకటి డౌన్ ఫాల్ చూస్తే.. మరో సినిమా ఎక్కడికో వెళ్లిందని తాను చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ స్పందించారు. రామ్ చరణ్ మీద తాను చులకన చేయున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాజాగా తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఈ మేరకు అల్లు అరవింద్ మాట్లాడారు.

- Advertisement -

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్లు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్ కాదని నేను భావించి నో కామెంట్స్ అన్నాను.. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ తనకు కొడుకు లాంటివాడన్న అరవింద్.. తనకు ఉన్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, ఆయనకు ఉన్న ఏకైక మేనమామను తానేనని తెలిపారు.

నిజానికి ఆరోజు దిల్ రాజు కష్టాలను ప్రస్తావిస్తూ తాను మాట్లాడానని.. అది యాదృచ్ఛికంగా వచ్చిన విషయమే తప్ప తాను కావాలని ప్రస్తావించింది కాదని అల్లు అరవింద్ అన్నారు. ఈ విషయంలో మెగా అభిమానులు తనను ట్రోల్ చేశారని అరవింద్ అన్నారు.

ఈ విషయంలో ఫీలైన మెగా అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే, నేను ఉద్దేశపూర్వకంగా దిల్ రాజుతో మాట్లాడుతున్నప్పుడు అలా అనలేదు. చరణ్ కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక ఎక్స్లెంట్ రిలేషన్షిప్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలన్నారు. దయచేసి అర్థం చేసుకోండి దిల్ రాజు లైఫ్ గురించి ప్రస్తావించడానికి మాత్రమే ఆ పదాన్ని వాడాను అలా వాడడం కరెక్ట్ కాదేమో అని తర్వాత అనిపించింది అంటూ అల్లు అరవింద్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News