బ్రిటన్(UK) ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు. దీంతో హెచ్‌వీఐ(HIV) పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానమంత్రిగా స్టార్మర్ రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా బహిరంగంగా హెచ్‌వీఐ పరీక్ష చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2030 నాటికి ఇంగ్లాండ్‌లో హెచ్‌ఐవీని అంతం చేయాలనే టార్గెట్ ప్రభుత్వం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ముందుకొచ్చి హెచ్‌ఐటీ టెస్టులు చేయించుకోవాలని ప్రధాని కార్యాలయం పిలుపునిచ్చింది.
ఇందులో భాంగా ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ టెరెన్స్ హిగ్గిన్స్ సంస్థతో కలిసి ర్యాపిడ్ హోమ్ టెస్టు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ముఖ్యమైన హెచ్‌ఐవీ పరీక్షలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని స్టార్మర్ వెల్లడించారు. క్షణాల్లో జరిగిపోయే ఈ పరీక్షను వారం రోజులపాటు ఉచితంగా పొందవచ్చన్నారు.