Tuesday, February 11, 2025
HomeతెలంగాణKTR: గరీబోళ్లతో ఆటలాడుతున్నారా?.. కేటీఆర్ ఆగ్రహం

KTR: గరీబోళ్లతో ఆటలాడుతున్నారా?.. కేటీఆర్ ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు. రేషన్ కార్డుల కోసం పదే పదే దరఖాస్తులు కోరుతున్న తీరును చూస్తుంటే.. అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ? అని ప్రశ్నించారు.

- Advertisement -

“ఒక్క రేషన్ కార్డు కోసం ఇంతగనం జనాన్ని పరేషాన్ జేస్తరా ? ఇంకెన్నిసార్లు ఇయ్యాలె.. అప్లికేషన్లు ? ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిండ్రు.. ప్రజాభవన్ కు వచ్చి ఇచ్చిండ్రు..గాంధీభవన్ కు వచ్చి ఇచ్చిండ్రు..గ్రామసభల్లో ఇయ్యమంటే మళ్లీ ఇచ్చిండ్రు..ఇన్నిసార్లు ఇచ్చినంక..మళ్లీ మొత్తం కథ.. మొదటికి తెస్తరా..? అని ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. ఏడాది అయిపాయె..! ఇచ్చిన అప్లికేషన్లు.. చెత్తకుప్పల పాలాయె..!! మళ్లీ కొత్తగా “మీ సేవలో” దరఖాస్తు చెయ్యాల్నా? తమాషా చేస్తున్నరా ? గరీబోళ్లతో ఆటలాడుతున్నరా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కాంగ్రెస్ పాలన అంటే “దరఖాస్తులు, దఫ్తర్లేనా”? .. అసలు ఈ కాంగ్రెసోళ్లకు రేషన్ కార్డుల కోసం పేద జనం తిరిగి తిరిగి బేజారైనా.. సర్కారుకు సిగ్గనిపిస్తలేదా ? రేషన్ కార్డు ఇచ్చే ఉద్దేశం అసలు ప్రభుత్వానికి ఉన్నదా..? లేదా..? చేతకాకపోతే.. చేతులెత్తేసి క్షమాపణ అడుగుండ్రి. అంతే తప్ప.. అప్లికేషన్లతో ఆగంచేస్తే జనం ఊరుకోరని..కాంగ్రెసోళ్లను ఊరూరా ఉరికిస్తరు..! తస్మాత్ జాగ్రత్త” అని కేటీఆర్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News