తిరుమల వెంకన్న స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు కార్తీక్ శివకుమార్ మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు.
ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల కార్తీక్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన కుమారుడు పుట్టిన అనంతరం దర్శనానికి రాలేదని తెలిపారు. కుమారుడితో కలసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియార్ సినిమాలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సినిమా బిగ్ హిట్ సాధించింది. అతని దర్శకత్వంలోనే సర్దార్-2 చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ-2 చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో కార్తీక్ తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది.
కార్తీక్ నటించిన సత్యం సుందరం సినిమా తెలుగు, తమిళ సినిమాలో భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది చివరిలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.