రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) ఇటీవల నటించిన సినిమాలు ఫ్లాప్‌లు అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ గుండె చేయించుకుని తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. VD12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్, టీజర్ ఫిబ్రవరి 12 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/ntr-vijay-768x1113-1.jpg)
ఈ టీజర్‌ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. తమిళ్ టీజర్‌కు సూర్య, హిందీ టీజర్‌కు రణబీర్ కపూర్ వాయిస్ ఇస్తుండగా తెలుగులో మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) వాయిస్ ఇవ్వనున్నారు. తాజాగా ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటోలు మూవీ యూనిట్ షేర్ చేసింది. దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/vd12-768x1024-2.jpg)