Tuesday, February 11, 2025
Homeకెరీర్JEE Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

JEE Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు(JEE Results) విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి సెషన్ పరీక్షకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. అమ్మాయిల విభాగంలో ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞ.. తెలంగాణకు చెందిన బనిబ్రత మజీ కూడా 100 పర్సంటైల్ సాధించారు.

- Advertisement -

ఈ ఫలితాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్ క్లిక్ చేయండి. కాగా ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరగనుంది. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని అభ్యర్థులు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండు విడతల్లో సాధించిన ఉత్తమ స్కోర్ పరిగణలోకి తీసుకుని 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News