Tuesday, February 11, 2025
Homeహెల్త్Kidney: కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. లైట్ తీసుకుంటే అంతే..!

Kidney: కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. లైట్ తీసుకుంటే అంతే..!

ప్రస్తుత రోజుల్లో కిడ్నీ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. పది మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ మానవ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. కిడ్నీ లేకుండా జీవితం సాధ్యం కాదు. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యే సమయంలో పోషకాలతో పాటు అనేక హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. శరీరం నుండి ఈ విష రసాయనాలను తొలగించడానికి మూత్రపిండాలు పని చేస్తాయి. మూత్రపిండాలు శరీరంలో వడపోత పనితీరును నిర్వహిస్తాయి.

- Advertisement -

ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీల శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే మనం తినే కొన్ని ఆహార పదార్ధాల కారణంగా.. కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. అటువంటి స్థితిలో మూత్రపిండాలు పూర్తిగా విష రసాయనాలను ఫిల్టర్ చేయలేవు. అప్పుడు క్రమంగా మూత్రపిండాలు పాడవుతుంటాయి. కానీ కిడ్నీ ఒక్కసారిగా చెడిపోదు. దానికి ముందు శరీరం కొంత సంకేతం ఇస్తుంది. వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా సమస్యను నివారించవచ్చు. కిడ్నీలు పాడయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కిడ్నీలు పాడయ్యేముందు.. కాళ్ల వాపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాళ్ళలో వాపు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, హిమోగ్లోబిన్లో మార్పులు కనిపిస్తాయి. ఇది కాళ్ళను ప్రభావితం చూపిస్తాయంట. దీనితో పాటు మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందువల్ల, మూత్రపిండ వైఫల్యం విషయంలో, మూత్రం యొక్క పరిమాణం మారుతుంది. ఈ సమయంలో ఎక్కువ మూత్రం రావడం, రంగు, వాసన మారడం కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ఇక కిడ్నీ సరిగా పని చేయనప్పుడు, వికారం మొదలవుతుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు అనేక రకాల హానికరమైన రసాయనాలతో నిండి ఉంటాయి. అటువంటి స్థితిలో, వాంతులు కూడా మొదలవుతాయి. ఆకలి తగ్గుతుంది. కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఊపిరి ఆడకపోవడం గుండె జబ్బుల వల్ల మాత్రమే కాదు. మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను సరిగ్గా తొలగించకపోతే, అవి ఊపిరితిత్తులలోకి కూడా చేరుతాయి. ఊపిరితిత్తులలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. విపరీతమైన అలసట కూడా కిడ్నీ దెబ్బతినడానికి సంకేతం.

మూత్రపిండాల వైఫల్యం కారణంగా, టాక్సిన్స్ రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల అలసట వస్తుంది. మూత్రపిండ వైఫల్యం ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బాధ్యత వహించే ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేనప్పుడు, టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీనివల్ల నిద్రపట్టడం కూడా కష్టమవుతుంది. కాబట్టి, మీకు అలాంటి సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News