మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల సినిమా ఈవెంట్లలో చేస్తున్న వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో కాంట్రవర్సీకి కూడా కారణమవుతున్నాయి. తాజాగా బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. “ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్‌ని ఒక్కోసారి అడుగుతుంటాను. దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా మన లెగసీని ముందుకు కొనసాగించాలి. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అయితే ఇదే ఇప్పుడు ట్రోల్స్‌కు కారణమైంది. మెగాస్టార్ స్థాయిలో ఉండి ఆడపిల్లలు వద్దు అని వ్యాఖ్యానించడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వారసుడు కావాలి అనుకోవడంలో తప్పేం ఉందని వాదిస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా చిరు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతం చెందిందని.. తన ఆశయాలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి వ్యాఖ్యలు ట్రోల్స్‌కు గురి కావడం మెగా అభిమానులను కలవరపరుస్తోంది.