ఫిబ్రవరి 19న ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే మిచెల్ మార్ష్, హేజెల్‌వుడ్, ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా వ్యక్తిగత కారణాలతో స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్(Starc) కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. స్టార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతూ ఐదు మార్పులతో ఆసీస్ కొత్త జట్టును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సన్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. ట్రావెల్ రిజర్వ్: కూపర్ కొన్నోల్లీ