బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవారు ఉన్నారు. ఫిబ్రవరి నెల ఆరంభం నుంచి బంగారం ధరు ఏ రేంజ్‌లో పరుగెడుతున్నాయి. 1వ తారీఖు నుంచి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలాగ పెరిగిమనుషులను భయపెడుతుంది. అయితే ఈరోజు బంగారం ధరలు కొంచెం ఊరటను కలిగించాయి.
రోజు రోజుకు ఈ ధరలు పెరుగుతునే ఉన్న ధరలతో బంగారం కొనలేని వారికి ఈరోజు కొంత ఉపశమనం పొందే వార్త వచ్చేసింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే భారత్‌లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. అంతేకాదు అలా పెరుగుతూ లక్ష దాటేస్తుందనుకున్నారు. కానీ ప్రస్తుతం మధ్యలో బ్రేక్ వేసి ఆగింది.
నిన్న బంగారం ధరలు చూస్తే ఈరోజు కొంచెం తగ్గిందనే చెప్పాలి. నిన్న 22 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8010 గా ఉంది అంటే 10 గ్రాముల ధర రూ.80,100 గా ఉంది అదే 24 క్యారట్ల ధర ఒక గ్రాము రూ. 8738 గా ఉంది అదే 10 గ్రాములు ధర రూ. 87380 గా ఉంది. ఈరోజు బంగారం ధర నిన్నటితో పోలిస్తే 22 క్యారట్ల ధర ఒక గ్రాము ధర రూ. 70 లు తగ్గి రూ.7940 గా ఉంది. అదే 10 గ్రాముల ధర రూ. 79,400 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ. 71 తగ్గి రూ. 8667 గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ. 86670 గా ఉంది. ఇవి ఈరోజు బంగారం ధరలు.. రేపటి ధరలు ఇలా నే ఉంటాయన్నది లేదు..