మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస సినిమాలతో అభిమానులను పలకరిస్తున్నాడు. రెండు నెలల క్రితమే ‘మెకానిక్’ రాకీ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విశ్వక్.. తాజాగా ‘లైలా'(Laila) సినిమాతో రానున్నాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యకంలో మూవీ ప్రమోషన్స్ స్పీడ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో.. తన బ్రేకప్ స్టోరీ గురించి పంచుకున్నాడు.
24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానని.. తర్వాత మూడున్నరేళ్లకు బ్రేకప్ అయిందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఎంతో బాధపడ్డానని ఆ బాధ నుంచి బయటకు వచ్చి జీవితంపై దృష్టి పెట్టానని వివరించారు. ఆ తర్వాత తనకు ఎవరి మీద ప్రేమ పుట్టలేదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానన్నారు. జీవితంలో బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. బాధగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే దాని నుంచి వెంటనే బయటకు రాగలుగుతామని తెలిపారు.