Wednesday, February 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Kadiyam Nursery: కేసీఆర్ బర్త్ డేలో వృక్షార్చన

Kadiyam Nursery: కేసీఆర్ బర్త్ డేలో వృక్షార్చన

కడియం నర్సరీలో..

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతుబంధు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా రాజహేంద్రవరంలోని కడియం నర్సరీల రైతుల ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటి ఘనంగా వేడుకలు నిర్వహించారు. వృక్షార్చనలో వెయ్యి మొక్కలు నాటిన కడియం నర్సరీ రైతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు.

- Advertisement -

మొక్కలు నాటిన సంతోష్

ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రైతు బంధువు, హరిత ప్రేమికుడు అయిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కడియం నర్సరీ రైతు పాలూరి నాని ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అని రైతు బంధువు అయిన కేసిఆర్ పై రైతులు చూపించిన ప్రేమ చాలా అభినందనీయమని అన్నారు.

280 కోట్ల మొక్కలు

ప్రాంతాలుగా విడిపోయిన కూడా ప్రజలుగా కలిసిమెలిసి ఉందామని ఉద్యమ సమయం నుండి కేసీఆర్ చెప్పేవారని ఇప్పుడు అదే విధంగా ఇక్కడి వాతావరణం చూస్తుంటే గుర్తుకు వస్తుందని అన్నారు.
కెసిఆర్ 10 సంవత్సరాల తమ ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం 280 కోట్ల మొక్కలను నాటినట్టు వెల్లడించారు. దానివల్ల తెలంగాణ వ్యాప్తంగా 8.3% పచ్చదనం పెరిగిందని అన్నారు.


రైతులతో మాట్లాడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమంలో మా అందరికీ ఎంతో ఉపాధి లభించిందని మా నర్సరీల నుండి తెలంగాణ ప్రభుత్వం మొక్కలను కొనుగోలు చేయడం వల్ల మా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందిందని వారు, కేసిఆర్ రైతు బంధువు అని వారు అన్నారు. రైతులు ఎంతో ప్రేమతో మొక్కలు నాటి కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు అని, రైతులందరికీ కేసీఆర్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంతోష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు బాలాజీ, ఈల సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిమ్మలపూడి త్రిమూర్తులు, హరిత సేవ నాయకులు రాఘవ, కిశోర్ గౌడ్, పూర్ణ చందర్, పాండాల జగన్మోహన్, మురళీకృష్ణ,
సతీష్, ఎన్.ఎన్. రాజు, భోజనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News