Wednesday, February 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: మనది చరిత్ర మార్చిన పాలన: జగన్

Jagan: మనది చరిత్ర మార్చిన పాలన: జగన్

గుంటూరు వైసీపీ నేతలతో..

మన పరిపాలనకాలంలో అంటే 2019-2024 మధ్య జగన్ 1.౦ ప్రభుత్వం నడిచిందని, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్ర మార్చిన పాలన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నడిచిందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇతర స్ధానిక సంస్దల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన నేతల్లో సరికొత్త జోష్ నింపేలా ప్రసంగించారు.

- Advertisement -

మన ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టో అంటే చక్కటి అబద్దాలను, రంగు రంగు కాగితాలలో ముద్రించి ఎన్నికల్లో పంచడం, ఎన్నికల అయినపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల నుంచి పాలనలో తులసిమొక్కలా వ్యవస్ధను మార్చిన పాలన కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే జరిగింది. చరిత్రలో మునుపెన్నుడూ లేని విధంగా మేనిపెస్టోను కేవలం రెండే రెండు పేజీలకు కుదించి.. ఈ మేనిపెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటిదని చెపుతూ… దాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయం, సీఏంఓ, ప్రతి మంత్రి కార్యాలయంలోనూ, ప్రతి కలెక్టర్ కార్యాలయంలోనూ కనిపించే విధంగా ఏర్పాటు చేశాం.

బడ్జెట్ తో పాటే సంక్షేమ క్యాలండర్
ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇది అమలు కావాలని… ఏకంగా బడ్జెట్ ప్రవేపెట్టినప్పుడే సంక్షేమ క్యాలండర్ ను కూడా బడ్జెట్ తోపాటు ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో చెప్పి..అలా చెప్పిన తేదీకి బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే మన పార్టీ హయాంలోనే జరిగింది. అంతగా వ్యవస్ధను మార్పు చేశాం.

గతంలో ప్రభుత్వ సొమ్ము రూపాయి ఇస్తే… పదిహేనుపైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందన్న నానుడి మార్చి.. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వమే. ఒకవైపు కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నా.. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నా.. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గిన పరిస్ధితులు ఉన్నా, అనుకోని ఖర్చులు పెరిగినా ప్రజలకు మేలు చేసేందుకు ఏ రోజూ సాకులు వెదకలేదు. కారణాలు చూపలేదు. చెప్పిన ప్రతి మాటను ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే నెరవేర్చింది.

హామీల అమలుతో పాటు అభివృద్ధి
ఒకవైపు చెప్పిన ప్రతి మాటనూ నెరవేరుస్తూ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ది కూడా చేశాం. గవర్నమెంటు బడులలో నో వేకెన్సీ బోర్డులు వస్తాయని ఎప్పుడూ కలగనలేదు. ప్రభుత్వ బడులు ప్రయివేటు బడులతో పోటీపడతాయని ఎప్పుడూ వినలేదు. తొలిసారిగా చరిత్రను మార్చాం. ప్రభుత్వ బడులలో పిల్లలు అడ్మిషన్లకు నో వేకెన్సీ బోర్డులు వస్తాయని ఎప్పుడూ కలగనలేదు. ఎప్పుడూ కలగననని విధంగా ప్రయివేటు బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితి వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది.

ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు నేడు అనే ఉజ్వల కార్యక్రమం ప్రభుత్వ బడులలో మొదలైంది. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మొదలైంది. మూడోతరగతి నుంచి టోఫెల్ క్లాసులు మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగువల్ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోతరగతి నుంచి డిజిటల్ బోధన అందించాం.ఎనిమిదో తరగతి వచ్చేసరికి పిల్లలకు ట్యాబులు అందించాం. ఇవన్నీ వచ్చేసరికి ప్రయివేటు బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సి వచ్చింది.

ఒకవైపు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ.. మరోవైపు ఆ పిల్లలు పోటీ ప్రపంచంతో నిలబడి చదువులు కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వాళ్ల చదవుల్లో కూడా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలనే మార్పులు తీసుకువచ్చాం.

వైద్యంలోనూ ఊహకందని మార్పులు
వైద్యం మారింది. మొద్దమొదట సారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్టులు అందుబాటులోకి తెచ్చాం.మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు కొరత లేకుండా చేశాం.దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే ఏపీలో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు నేడు ద్వారా మార్పు చేశాం. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు గల మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చాం.
దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను మన హయాంలోనే కట్టడం ప్రారంభించాం. పేదవాడికి వైద్యం ఉచితంగా అందించేందుకు వేయి ప్రోసీజర్ల నుంచి 3300వరకు తీసుకుని పోవడంతో పాటు… రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. ఆరోగ్యశ్రీతో వైద్యం అందించిన తర్వాత పేదవాడు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా వారికి ఆరోగ్య ఆసరాతో అండగా నిలబడే కార్యక్రమం చేశాం. ఎప్పుడూ వైద్య రంగంలో చేయనన్ని మార్పులు చేశాం. ఇలా చేయగలుగుతామని కూడా ఎవరి ఊహకూ అందలేదు.

రైతును చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకేలు
వ్యవసాయ రంగంలో రైతుల ఇంటి వద్దనే ఆర్బీకే ఏర్పాటు చేశాం. అందులో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ని అసిస్టెంట్‌గా ఏర్పాటు చేసి రైతులను చేయిపట్టుకుని నడిపించేటట్టు చేశాం. తొలిసారిగా ఇ-క్రాప్ నమోదుతో ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో నమోదు చేశాం. రైతులందరికీ ఉచిత పంటల బీమా, వారందరికీ గిట్టుబాటు ధర వచ్చేలా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు దళారీ వ్యవ్ధను తీసివేస్తూ రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేసాం.ఇవన్నీ వైయస్సార్సీపీ హయాంలోనే జరిగాయి.
ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఏర్పాటు చేశాం. అదే సచివాయంలో మన ఊరి పిల్లలే సేవలందిస్తూ కనిపిస్తారు. ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికేవచ్చి పారదర్శంగా సేవలు అందించేవారు.
కూటమి పాలన – తిరోగమనంలో వ్యవస్ధలు
ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ ఇలా అన్ని వ్యవస్ధలూ తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి మారాడు. ఒకే ఒకే పార్టీ వైయస్సార్సీపీ పక్కకు వెళ్లి టీడీపీ వచ్చింది. అంతే తేడా… ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్ధ తిరోగమనంలోకి పోయింది. వైయస్సార్సీపీలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు చేస్తామన్న ప్రతి పథకం మోసం, అబద్దం. కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలివి.

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం
గతంలో మనకు 50 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఓటు షేర్ 40శాతం… 10 శాతం ఓట్లు తగ్గాయి. కారణం కేవలం మీ జగన్ ఆ రోజు వారిలా అబద్దాలు చెప్పలేకపోవడమే. మీ జగన్ అబద్దాలు చెప్పలేపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరమైనా మీ జగన్ మీ గుండెల్లో లీడర్ అంటే ఇలా ఉండాలని ముద్ర వేయగలిగాడు. రాజకీయాల్లో విలువలు ఉండాలి. విశ్వసనీయత అనే పదానికి అర్ధం తెలియాలి. మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయల్లో ఉంటాడు. 2019-24 మధ్య మన పాలన ప్రజలు చూశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పాలన కూడా ప్రజలు చూస్తున్నారు.
మనం ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా… అబద్దాలు చెప్పలేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇన్ని మోసాలు చేసిన, ఇన్ని అబద్దాలు చెప్పిన వ్యక్తి పరిస్ధితి ఏమవుతుందో ఆలోచించండి. ఇచ్చిన మాట గాలికొదిలేసిన ఈ పార్టీలు, ప్రభుత్వం వీళ్లు ప్రజలు ఓటుతో బంగాళాఖాతంలోకో ఇంకా అధోపాతాళానికో పోతారు.

ఎన్నికలు అయిన తర్వాత కూడా వైయస్సార్సీపీ కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతాడు. మా హయాంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చిన ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పగలుగుతారు.
కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్కరూ కూడా, ఏ ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. వీళ్లు ఏ ఇంటికి వెళ్లినా… ఆ ఇంట్లోనుంచి చిన్నపిల్లలు నా రూ.15 వేలు ఏమయిందని అడుగుతారు. ఆ పిల్లల తల్లులు నా రూ.18 వేలు ఏమయిందని అడుగుతారు. ఆ అమ్మల అత్తలు, అమ్మలు మాకు 50 ఏళ్ల వచ్చాయి… మా రూ.48 వేలు ఏమయ్యాయని.. ఆ ఇంట్లో రైతులు మా రూ.20 వేలు ఏమయ్యాయని, అదే ఇంట్లో ఉద్యోగం కోసం వేచి ఉన్న పిల్లాడు నా రూ.36వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తాడు.

బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ
ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి పలకరించే పరిస్థితి లేదు. వీళ్లే మేం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు. బాండ్లు కూడా రాసిచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని రాసిచ్చారు. ఇవాళ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువు అయింది. ఇప్పుడే ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. త్వరలోనే కాలర్ పట్టుకుని నిలదీసే రోజులు కూడా రానున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది.

స్కాములు తప్ప పాలన లేని ప్రభుత్వమిది
స్కాములు తప్ప ఈ ప్రభుత్వంలో ఏం జరగడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి పాలన సాగించేటప్పుడు.. ప్రతి పార్టీకి, ముఖ్యమంత్రికి ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికీ ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలని అనుకుంటారు .ఇవాళ పరిస్థితి చూస్తే… చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు అధికారంలోకి ఉండి దోచుకోడం, దోచుకున్నది పంచుకుని తినడం మాత్రమే జరుగుతుంది.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం స్కామ్, ఇసుక స్కామ్. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు ఇంత ఇవ్వాలి.. ఆయన చంద్రబాబుకి ఇంత ఇవ్వాలి. ప్రతి నియోజకర్గంలోనూ యధేచ్చగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చిన్న పిల్లలని కూడా చూడకుండా 111 సెక్షన్ తో కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో తప్పులను ప్రశ్నించి పోస్టింగులు పెట్టేవారిని … టెర్రరిస్టులకు పెట్టే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్టులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారు. రకరకాల స్టేషన్లు, జిల్లాల చుట్టూ తిప్పుతున్నారు.

రాబోయేది జగన్ 2.0 పాలన
కానీ చంద్రబాబు నాయుడు మర్చిపోతున్న విషయం ఏమిటంటే… మంచి పాలన అందిస్తే ప్రజలు ఆదరిస్తారు. కానీ ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.
చంద్రబాబు నాయుడుకి ప్రతి వైయస్సార్సీపీ కార్యకర్త తరపున చెబుతున్నాను. మరలా వచ్చేది జగన్ 2.0 పాలన. చట్టవిరుద్దంగా అన్యాయాలు చేసే వారెవ్వరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముుందు నిలబెడతాం.

కార్యక్తలకు పెద్దన్నగా ఉంటాను
జగన్ 1.0పాలనలో మనం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. ఆతర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో ఆడుగులు వేసాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈ సారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ కార్యకర్తలకు తోడుగా వారి ఇంటికి పెద్దన్నగా ఉంటాను.

మార్చి నాటికి స్ధానిక సంస్ధలకు నాలుగేళ్లు పదవీ కాలం ముగియబోతుంది. తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ల ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా.. మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రాకమానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్ ను మనం కాపాడుకుందాం. మన విలువలు మనం కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తాం.

ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్నటి స్దానిక సంస్ధల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి సభ్యులు లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
తిరుపతి కార్పొరేషన్ లో 49 ఉంటే 48 వైయస్సార్సీపీ గెలిచింది. ఒక్కటే టీడీపీ గెల్చింది. ఒక్కటే గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ల మనిషి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు ద్వారా వాళ్లే అడ్డుకుంటారు. వీళ్లే పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మరలా ఎన్నికల్లో మా వాడు గెలిచాడని చెప్పుకుంటారు.
ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైయస్సార్సీపీ, టీడీపీకి వచ్చింది కేవలం 3. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లు ఉంటే 54 వైయస్సార్సీపీవే.
హిందూపురం మున్సిపాల్టీలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అదేదో ఘనకార్యంగా చెప్పుకుంటున్నాడు. 38 డివిజన్లు ఉంటే వైయస్సార్సీపీ 29 వచ్చాయి. టీడీపీకి 6 వస్తే దాంట్లో పదవి వచ్చిందని ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. పాలకొండలో 20 ఉంటే 17 వైయస్సార్సీపీ, 3 టీడీపీ ఉంటే వైయస్సార్సీపీ వాళ్లను లాక్కోలేక ఎన్నిక వాయిదా వేశారు. తునిలో టీడీపీకి ఒక్కరూ లేరు. అక్కడ ఉద్రిక్త పరిస్ధితుల మధ్య ఎన్నికలు వాయిదా అంటారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33కు ౩౩ వైయస్సార్సీపీ. అక్కడ కూడా ఎన్నికలు వాయిదా అన్నారు. నూజివీడులో 32 ఉంటే 25 వైయస్సార్సీపీ, 7 టీడీపీ. బుచ్చిరెడ్డిపాలెంలో 20 ఉంటే వైయస్సార్సీపీ 18 టీడీపీ 3, నందిగాం మున్సిపాల్టీలో కూడా వైయస్సార్సీపీదే మెజార్టీ. చివరికి గుంటూరులో కూడా 57లో 46 స్ధానాలు వైయస్సార్సీపీ.. టీడీపీ 9, కూటమికి 2 ఇక్కడ కూడా అవిశ్వాసం పెట్టి మేయర్ ను దించేస్తామని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది.

స్దానిక సంస్ధలు ఎన్నికలు మన ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాలు తర్వాత జరిగాయి. ప్రజలు ఆ ఎన్నికల్లో ఇలాంటి నెంబర్లతో భారీ మెజార్టీతో వైయస్సార్సీపీకి పట్టం కట్టారు. ఆ రోజు తాడిపత్రి, దర్శి రెండు మున్సిపాల్టీలే పోయాయి. తాడిపత్రిలో 20 స్ధానాలు వాళ్లకు 18 స్దానాలు మనకు వచ్చాయి. ఆ రోజు నేను గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండూ కూడా వాళ్లకు వచ్చి ఉండేవి కావు. కానీ మనం ప్రజస్వామ్యానికి కట్టుబడి, ఆ ఫలితాలను గౌరవించాం. కానీ టీడీపీ తప్పుడు సంప్రదాయాలు పాల్పడుతోంది.

ప్రజాస్వామ్యం గెలవాలి- ఇదే వైయస్సార్సీపీ ఐడియాలజీ
ఈ రోజు టీడీపీ చేస్తున్నదేమిటి. ఇదా ప్రజాస్వామ్యం. అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలవాలి. విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు ఎదగాలి. కార్యకర్తలు ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ప్రజలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి. ఇది వైయస్సార్సీపీ సిద్ధాంతం. ప్రజలు మన పాలన చూశారు. చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఈ సారి ప్రజలు మనల్ని ఎన్నుకుంటే మరో 30 సంవత్సరాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు.

ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి
ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ చంద్రబాబును ..నువ్వు ఎందుకు నొక్కలేదని అడుగుతున్నారు. నిస్సిగ్గుగా ఇపుడు బటన్ ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నాడు. మొహమాటం లేకుండా, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. మరి ఈ వ్యక్తి చీటర్ కాదా?, ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా?
మీరు, మేమూ మనందరం కలిసికట్టుగా తోడుగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్ధితిలోకి తీసుకునిపోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News