ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) మార్సెయిల్‌లో ఏర్పాటుచేసిన భారత నూతన కాన్సులేట్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ (Macron)తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ స్మారకం నిర్మిచింది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు ప్ఱధాని కార్యాలయం వెల్లడించింది. సాంకేతికత, రక్షణ, పౌర అణుఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు పేర్కొంది.
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ కాసేపట్లో అమెరికా చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశముంది.