ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnaraju)పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ(CID) మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్(Vijay Paul)ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు వచ్చిన రఘురామ న్యాయస్థానంలో తన స్టేట్ మెంట్ ఇచ్చారు.
కాగా 2021లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ.. కస్టోడియల్ టార్చర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై RRR గుంటూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ కేసు విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని నియమించింది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం విజయ్ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విధితమే.