Thursday, February 13, 2025
HomeTS జిల్లా వార్తలునల్గొండKodada: బర్డ్ ఫ్లు వ్యాప్తికి కోళ్ల వాహనాలు కారణం

Kodada: బర్డ్ ఫ్లు వ్యాప్తికి కోళ్ల వాహనాలు కారణం

రామాపురంలో..

బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి కోళ్ల రవాణా వాహనాలు కారణమవుతాయని జిల్లా పశు వైద్య-పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం కోదాడ మండలంలోని రామాపురం అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళ ద్వారా వచ్చే బర్డ్ ఫ్లూ వ్యాధి సంక్రమించిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చే కోళ్ల రవాణా వాహనాలను తనిఖీ చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ కే తిరిగి తిప్పి పంపారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా వాహనాలు కారణం అవుతాయి అని, కాబట్టి వాహనాలను సానిటైజ్ చేయాలని, చనిపోయిన కోళ్లను గుంత తీసి, సున్నం పోసి, పూడ్చాలని, బయట కాలువలో, ఆరుబయట ప్రాంతాల్లో పడేయకూడదని హెచ్చరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా. పెంటయ్య, కోదాడ మండల పశు వైద్య అధికారి డా.మధు, పశువైద్య సిబ్బంది చిరంజీవి, శ్రీను పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News