కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర, రథోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/16f635c2-4aad-4c8a-a68c-c2734404b084-1024x457.jpg)
ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజు ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వర స్వామి తదితర విగ్రహాలతో రథంపై ఊరేగింపు నిర్వహిస్తారు. దీనిని తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/41c15e8a-bd3f-48a0-9354-547d3a3be7ef-827x1024.jpg)
స్వామి వారిని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ, సోనే రావు దంపతులు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ సిడం గణపతి, అదేవిధంగా జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, మంచిర్యాల జిల్లా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిరోషా, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/42876df6-b75b-49c3-96aa-2f110250c1c7-1024x576.jpg)