Thursday, February 13, 2025
HomeఆటInd vs Eng: ఇంగ్లాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 3-0తో సిరీస్ కైవసం

Ind vs Eng: ఇంగ్లాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 3-0తో సిరీస్ కైవసం

స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు  ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో టామ్ బాంటన్ (38), బెన్ డకెట్ (34) లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.

- Advertisement -

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు బెన్‌డకెట్, ఫిలిప్ సాల్ట్ (23) శుభారంభం అందించారు. డకెట్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు కేవలం 6.2 ఓవర్లలో 60 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి అర్ష్ దీప్ సింగ్ బ్రేక్ వేశాడు. డకెట్‌ను ఔట్ చేశాడు. సాల్ట్, టామ్ బాండన్, జోరూట్ (24), హ్యారీ బ్రూక్ (19)లకు మంచి ప్రారంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అటు కెప్టెన్ జోస్ బట్లర్ (6)తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ (9)లు సైతం విఫలం కావడంతో ఏ దశలోనూ ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా సాగలేదు. దీంతో భారత్ భారీ తేడాతో గెలుపొందింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఇంగ్లాండ్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. రోహిత్ నిరాశపరిచినా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112) సెంచరీతో చెలరేగాడు. ఇక చాలా కాలంగా బ్యాడ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ (52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78) పరుగులు చేసి విజృంభించాడు.

కెఎల్ రాహుల్ (40) వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. సాకిబ్ మహమూద్, గుస్ అట్కిన్సన్, జో రూట్ లు తలా ఓ వికెట్ సాధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News