సాధారణ రోజుల్లో ఎక్కడైనా పాములు కనిపిస్తేనా చాలా భయపడుతుంటాం. అవసరమైతే ఆ సర్పాలను చంపేందుకు కూడా వెనుకాడం. ఇలాంటి ఘటన మన విశాఖలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ ఆ సర్పాన్ని మాత్రం చంపలేదు. పైగా సాక్షాత్తు శివుడే ఆ సర్పం రూపంలో వచ్చాడని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
మాఘ పౌర్ణమి కావటంతో ఇప్పుడు ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలాంటి చోట్ల ఇలాంటి సర్పాలు కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే మన విశాఖలో చోటుచేసుకుంది. దీంతో భక్తులు భయపడకుండా నాగ సర్పానికి విశేష పూజలు చేశారు.
విశాఖ జిల్లా మీద రెళ్లి వీధి, చంద్రబాబు నాయుడు కాలనీ దగ్గర సత్యనారాయణస్వామి గుడికి వెళ్లే మార్గంలో శివాలయం వెలసి ఉంది. ఎన్నో మహిమలు గల ఆలయంగా ఇక్కడి భక్తులు తెలుపుతున్నారు. అయితే ఇంతలా ఈ శివాలయం ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ శివాలయానికి నాగ సర్పం కాపలాగా ఉంటుంది అని భక్తుల నమ్మకం.
అయితే మాఘ పౌర్ణమి రోజున శివలింగంపై నాగసర్పం చూసి భక్తులు బారులు తీరారు. తమ సెల్ ఫోన్ లలో వీడియోలు, ఫోటోలు తీశారు.