క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని నల్లగొండ డిఎస్పి కె.శివరాం రెడ్డి అన్నారు. నల్లగొండ సబ్ డివిజనల్ స్థాయిలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ఎన్జీ కళాశాలలో కబడ్డీ పోటీలనీ ప్రారంభించి మాట్లాడారు.
యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించేలా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఐపీఎస్ ఆదేశాలతో కబడ్డీ పోటీలు నిర్వహించారు. 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో యువకులు ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతాయని, క్రీడలను అలవాటు చేసుకుంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను, అనుకోని పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వస్తుందని, ఓటమిని కూడా కసితో, పట్టుదలతో ప్రయత్నించి గెలుపుకి నాందిగా మలుచుకోగలుగుతారు అని, యువత చెడు వ్యసనాలబారిన పడుతున్నారని, చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యల దాకా వెళ్తున్నారని, మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారని, అదే క్రీడలను మన రోజువారి చర్యలో భాగంగా చేసుకుంటే ప్రతి విషయానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరని, క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సూచించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/a505b494-adac-473e-91ff-70a56d24e860-1024x768.jpg)
ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజు, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు, నల్గొండ వన్ టౌన్ ఎస్ఐలు శంకర్, సందీప్ రెడ్డి, కనగల్ ఎస్ఐ విష్ణు, పీఈటీలు, పిడిలుగా పనిచేస్తున్న గిరిబాబు, బాలరాజు, సత్యనారాయణ, శంభు ప్రసాద్ లు, క్రీడాకారులు, పాల్గొన్నారు.