ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ( Bird Flu) సోకింది. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయిందని జిల్లా వైద్యశాఖాధికారిణి తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమయిందన్నారు. ఈ మేరకు కోళ్ల ఫారం సమీపంలోని సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించారని చెప్పారు.
బర్డ్ ఫ్లూగా నిర్ధారణ కావటంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారని మీడియాకి చెప్పారు. దీంతో ఇప్పటి వరకు కోళ్లకు సోకిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనిషికి సోకటంతో తొలి కేసు నమోదు అయిందని జిల్లా వైద్యశాఖాధికారిణి తెలిపారు. మెుదటి కేసు నమోదు కావటంతో అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు.
ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లు చనిపోయాక పూర్తిగా ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు ఇచ్చారని వెల్లడించారు.
ఏలూరు జిల్లా పశు సంవర్థక శాఖ కార్యాలయంలో 24X7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 99667 79943 ఇచ్చారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్నా ఆ నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Bird Flu:ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES