ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ జల్‌పల్లిలోని నివాసం వద్ద గతేడాది డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి జర్నలిస్టు ఫిర్యాదుతో ఆయనపై పహాడిషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మోహన్ బాబు పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్న విషయం విధితమే. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.