రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమాతో పాటు ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లోఎ ప్రభాస్‌తో దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ప్రభాస్‌తో పాటు డైరెక్టర్ హను రాఘవపూడి, కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ కూడా ఉన్నారు.
“నా 544వ సినిమా బాహుబలి ప్రభాస్‌తో చేస్తున్నాను. ఈ సినిమాని ట్యాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నా ఫ్రెండ్ బ్రిలియంట్ కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ దీనికి పనిచేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన కథ. జీవితంలో ఇంకేం కావాలి” అని రాసుకొచ్చారు. అయితే ఈ ఫొటోల్లో ప్రభాస్ లుక్ మాత్రం అదిరింది. కోట్ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని, మంచి హెయిర్ స్టైల్, ట్రిమ్మింగ్ గడ్డంతో క్లాసీ లుక్‌లో అదిరిపోయాడు.