ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో టాపర్గా నిలిచిన తెలుగమ్మాయి మనోజ్ఞను ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అభినందించారు. మనోజ్ఞ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. తన కార్యాలయంలో మనోజ్ఞతో పాటు ఆమె తల్లిదండ్రులను సత్కరించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjpNci7aIAAA89E-1024x681.jpg)
“జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవు. JEE (Mains) – 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను అభినందించాను. మనోజ్ఞ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏ అవసరం ఉన్న ఒక్క మెసేజ్ పెట్టు అన్నగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చాను. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో నాకు తెలుసు. అందుకే ఆమె తల్లి గారిని కూడా సత్కరించాను.” అని తెలిపారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjpNU5NaoAAI7bL-1024x640.jpg)