ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఏకంగా 142 పరుగుల భారీ తేడాతో విజయం సాదించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధికంగా నాలుగుసార్లు వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
వెస్టిండీస్ (2022), శ్రీలంక (2023), న్యూజిలాండ్ (2023), ఇంగ్లండ్ (2025)పై ఈ ఘనత సాధించాడు. దీంతో వన్డేల్లో నాలుగు వేర్వేరు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసి తొలి భారత కెప్టెన్‌గా కూడా నిలిచాడు. రోహిత్ తర్వాతి స్థానాల్లో మూడేసి క్లీన్‌స్వీప్ లతో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు. ఇదిలా ఉంటే గత 14 ఏళ్లలో అత్యధిక క్లీన్‌స్వీప్ లు సాధించిన జట్టుగా టీమిండియా(12) నిలిచింది.
ఇక ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు గెలిచి మంచి ఊపు మీదన్న రోహిత్ సేన ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే కసితో ఉంది. ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న తన మొదటి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ జట్టులో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్థాన్ జట్టుతో ఫిబ్రవరి 23న తాడోపేడో తేల్చుకోనుంది.