భవిష్యత్ ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని తెలంగాణ సీఎం(CM Revanth Reddy) రేవంత్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్(Microsoft Campus)ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటఅఈ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేయనుండడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని.. మైక్రోసాఫ్ట్ ఇండియాకు వచ్చి ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అన్నారు. నగరంలో ఏఐ సెంటర్ (AI Center) ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌తో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు. ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందని రేవంత్ వివరించారు.