Thursday, February 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: స్వామిమలై శ్రీ స్వామినాథుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: స్వామిమలై శ్రీ స్వామినాథుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం స్వామిమలై (Swaminalai) . ఇక్కడ కొలువైన శ్రీ స్వామి నాథుడిని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువారం దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తంజావూరు సమీపంలోని స్వామిమలైని పవన్ సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు శ్రీ కన్నన్ గురుకల్ సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచ హారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ పవన్ కళ్యాణ్ ప్రదక్షిణలు చేసి ధ్వజ స్తంభానికి మొక్కారు. స్వామి నాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.

శ్రీ సుందరేశ్వరన్, మీనాక్షీ అమ్మన్ దర్శనం
శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆది దంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ కమిషనర్ ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News