గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు తమ ఎస్కార్ట్ వాహనంలో వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. తొలుత విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మరో వాహనంలో కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మరోవైపు నందిగామ వద్ద వంశీ భార్యను పోలీసులు అడ్డుకుని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు.
వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీసు 30 చట్టం అమల్లో ఉన్నట్లు ఎస్పీ గంగాధర్ తెలిపారు. ర్యాలీలు, సభల నిర్వహణతో పాటు ప్రజలు గుమిగూడటం నిషేధమని చెప్పారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా వైసీపీ కీలక నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/130225vamsi2b.webp)