క్‌సభలో ఆదాయపు పన్ను కొత్త బిల్లు(Income Tax Bill)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్ మెంట్ ఇయర్ ఉండగా ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 01 నుంచి అమలులోకి రానుంది.
- Advertisement -
అయితే ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. అనంతరం మార్చి 10వరకు లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండు దఫాలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగగా.. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.