Thursday, February 13, 2025
HomeతెలంగాణErrabelli: సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Errabelli: సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందన్నారు. అందుకే ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందని తెలిపారు.

- Advertisement -

ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని బాంబు పేల్చారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. పథకాల పేర్లు మార్చి ఎంతో అభివృద్ధి చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఎర్రబెల్లి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News